టాలీవుడ్ ఇండస్ట్రీలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తారక్ కెరీర్ తొలినాళ్లలో భారీ విజయాలను అందుకున్నా వరుస ప్లాపులు సైతం ఒక దశలో ఇబ్బందులు పెట్టాయి. మాస్ ప్రేక్షకులను మెప్పించాలని తారక్ వేసిన తప్పటడుగుల వల్ల కొన్ని సినిమాలు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస విజయాలతో జోరు మీదున్నప్పటికీ వార్2 సినిమాతో మళ్లీ రిస్క్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించడం తారక్ కెరీర్ కు కీలకం కానుంది. ఈ సినిమాకు ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా ఆ ప్రభావం తారక్ కెరీర్ పై ఊహించని స్థాయిలో పడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ సినిమాలో తారక్ కు హీరోయిన్ కూడా లేదని సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరిగింది. 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

కూలి సినిమాతో ఊహించని పోటీ ఎదురవుతూ ఉండటం కూడా వార్2 కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది. నిర్మాత నాగ వంశీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ పడటం లేదు. ఆగస్టు నెల 14వ తేదీన వార్ 2 సినిమాకు సంబంధించి రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

బెనిఫిట్ షోలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. అయితే జూనియర్ ఎన్టీఆర్కు మాస్ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్లు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. వార్2 సినిమా 1000 కోట్ల రూపాయల సినిమా కావాలని కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ప్రతిభ చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ టాలీవుడ్ హీరోల కాంబినేషన్లో మరిన్ని ఎక్కువ సంఖ్యలో సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: