బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా సొంత పార్టీ నేతల పైన విమర్శలు చేయడంతో బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కవిత పైన చర్యలు తీసుకున్నారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే సొంత కూతురు అయినా సరే చూడకుండా కేసీఆర్ కవితను సస్పెండ్ చేశారు. ఆ తర్వాతే కవిత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నారంటూ ఒక సంచలన ప్రకటన చేసింది. అయినప్పటికీ కూడా ఆమె హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు చేసింది. తన సస్పెండ్ వెనక కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. ఇప్పుడు తాజాగా కవిత సస్పెన్షన్ పైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.


కవిత వ్యాఖ్యలపైన తాను మాట్లాడాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీలో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకున్నామని మరల ఆమె గురించి మాట్లాడడానికి ఏమీ లేదంటూ తెలిపారు. ఒకసారి ఆక్షన్ తీసుకున్నాక నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదంటు తెలియజేశారు. ఇంతకుమించి కవిత విషయం పైన మాట్లాడడానికి పెద్దగా ఏం లేదంటూ కుండబద్దలు కొట్టేలా చెప్పేశారు..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టు పైన చేసిన విమర్శలకు కౌంటర్ వేశారు




కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని దుష్ప్రచారం చేస్తానని.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాలేశ్వరం ప్రాజెక్టుల లక్ష కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి 94 వేల కోట్ల రూపాయలతో ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనిపిస్తూ ఉంటే మరొకవైపు అవినీతి ఎలా అవుతుందంటూ కొట్టిపారేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదంటూ కేటీఆర్ విమర్శించారు. ఇలా కాలేశ్వరం పైన తప్పుడు ప్రచారం చేసిన సీఎం ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తన చెల్లెలు కవిత, సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: