
దాదాపు 24 ఏకాదశిలలో ఇది అత్యంత శక్తివంతమైనదిగా చెబుతున్నారు పండితులు . ఈరోజు ఆచరించే ఉపవాసం అన్ని ఏకాదశి ఉపవాసాలలోకి చాలా కష్టతరమైనది ..అదేవిధంగా ఫలవంతమైనది అంటూ చెబుతున్నారు . దీనివల్ల అనేక శుభాలు కూడా ఏర్పడతాయి అని పండితులు చెబుతున్నారు . సాధారణంగా నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేసేవాళ్లు ఏకాదశి తిధి ప్రారంభం నుండి ద్వాదశి పెట్టేవరకు నీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే కొందరు అనారోగ్య కారణంగా అలా కటిక ఉపవాసం చేయలేకపోవచ్చు . అలాంటివాళ్లు పాలు పండ్లు తీసుకొని భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేయవచ్చు అంటున్నారు కొందరు పండితులు.
మరీ ముఖ్యంగా ఉదయం లేచి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకుని పూజ గదిని పసుపు కుంకాల తో రకరకాల పూలతో అలంకరించి .. నైవేద్యాలతో ధూప దీపాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే అంతా శుభం జరుగుతుంది అని.. ప్రజలు ఏకాదశి నాడు పూజ చేసుకుని నలుగురికి తీర్థ ప్రసాదాలను పంచగలిగితే అది ఇంకా పుణ్యం చేకూరుస్తుంది అని కొందరు పండితులు చెబుతున్నారు. ఉపవాసం చేయలేని పక్షంలో పాలు పండ్లు ఆహారంగా తీసుకొని పూజ చేయొచ్చు అంటున్నారు పండితులు . అలా కూడా ఉండలేని వాళ్లు డయాబెటిక్ పేషెంట్స్ రకరకాల జబ్బులు కలిగిన వ్యక్తులు అసలు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు అని .. మనసు నిర్మలంగా ఉంచుకొని భక్తిశ్రద్ధతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు.
నిర్జల ఏకాదశి రోజు ఏం చేయాలి..?
*ముందుగా పవిత్రమైన జలం లేదా స్వచ్ఛమైన నీటితో పవిత్ర స్నానం చేయాలి
*శుభ్రమైన పసుపు రంగు దుస్తులను ధరించాలి.
*ఆ తర్వాత ఓం నమో భగవతి భగవతే వాసుదేవాయ అంటూ జపిస్తూ ఉపవాసం చేస్తూ(ఉపవాసం చేయలేని వాళ్లు మంత్రం జపిస్తే చాలు) విష్ణువును పూజించాలి .
*పంచామృతం స్నానం సమర్పించండి .
*పూజలో పసుపు పువ్వులు తులసి ఆకులు గంధం ఎక్కువగా ఉపయోగించాలి .
*విష్ణు సహస్రనామం పఠించండి .
*రాత్రి పూట మేల్కొని భజనలు కీర్తనలు ధ్యానంలో పాల్గొనండి .
*మరుసటి రోజు ఉపవాసం ముగించండి (ఉపవాసం ఉండలేని వాళ్లు).. పూజ చేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది.
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు.. కొంతమంది పండితులు చెప్పిన సమాచారం ఆధ్యాత్మిక గ్రంథాలలో పొందుపరిచిన వివరాల ప్రకారమే ఈ కథనం రాయబడినది . ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే దీనిని పరిగణలోకి తీసుకునే ముందు మీరు విశ్వసించే పండితుల సలహాలు తీసుకోవడం మరింత ఉత్తమం అని గుర్తుంచుకోండి..!!