
తేజస్వి మదివాడ హెయిర్ కట్ చేసుకుని మరి కళ్ళ అద్దాలు పెట్టుకొని ఎంట్రీ ఇచ్చింది.. ఇలా ఎంట్రీ ఇవ్వడంతో శ్రీముఖి పార్టీ అంతా నీలోనే కనిపిస్తోంది అంటూ ఆమెను ఏడిపిస్తుంది.. పార్టీ బాయ్స్ చేసుకుంటే బాగుంటుందా లేకపోతే గర్ల్స్ చేసుకుంటే బాగుంటుందా అంటూ శ్రీముఖి అడగగా?.. అదిరిపోయే కౌంటర్ వేసింది తేజస్వి.. బాయ్స్ చేసుకోవడానికి అదేమైనా పులిహోర..అమ్మాయిలు లేకుండా అసలు అబ్బాయిలకు పార్టీలోకి ఎంట్రీనే లేదు అంటూ కౌంటర్ వేసింది.
శ్రీముఖి కొంతమంది అబ్బాయిలు పార్టీలో గ్లాసు పట్టుకుని తెగ హడావిడి చేస్తూ ఉంటారు.. అలా అమర్ కూడా అలాంటి వాడే అంటూ శ్రీముఖి పంచ్ వేయగా.. ఆ తర్వాత మరొక కంటెస్టెంట్ పృథ్వి దగ్గరికి వచ్చి క్యూస్షన్ అడుగుతూ విష్ణు తీసేస్తే అక్కడున్న వాళ్ళలో నువ్వు ఏ అమ్మాయితో పార్టీకి వెళ్తావు అంటూ అడగగా.. ఆ వెంటనే శ్రీముఖి భుజం పైన చేయి వేసి దగ్గరికి తీసుకోవడంతో.. దీంతో శ్రీముఖి అమ్మో వీడు నాకే ఎసరు పెట్టేసారు అంటూ నవ్వుకుంది.. శ్రీముఖి విష్ణు ప్రియ ను ఏడిపించడానికి ఫన్నీగా ఇలా చేసినట్లుగా ఈ ప్రోమోలో కనిపిస్తోంది.. అంతేకాకుండా మేమిద్దరమే పార్టీకి వెళ్తే నీకు ఓకేనా అంటూ విష్ణు ప్రియ అని అడగగా వెంటనే ఆమె సిగ్గుపడుతున్నట్లు ప్రోమోలో చూపించారు.