రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొంతకాలం నుంచి ఎంత భీకరమైన యుద్ధం కొనసాగుతుందో  ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయ్. అయితే ఇక ఈ యుద్ధం లో ఎంతో మంది సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఇరు దేశాలు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. అయితే రెండు దేశాల మధ్య ఎన్నో సార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అని చెప్పాలీ.



 ప్రపంచం లోనే అత్యాధునిక  ఆయుధ సంపత్తి కలిగిన దేశం అయిన రష్యా తో అటు చిన్న దేశమైన ఉక్రెయిన్ వీరోచితంగా పోరాటం చేస్తుంది. తమ సార్వభౌమత్వాన్ని రష్యా దగ్గర తాకట్టు పెట్టేందుకు తమ సిద్ధంగా లేము అనే విషయాన్ని చెబుతున్నవు ఉక్రెయిన్ జెలెన్ స్కి చెబుతున్నాడు. ఈ క్రమం లోనే ఉక్రెయిన్ రష్యాకు యుద్ధంలో దీటుగానే బదులుస్తుంది. కాగా యూరోపియన్ యూనియన్ అగ్ర దేశమైన అమెరికా నుంచి ఆయుధ సహకారం కావాలని అలా జరిగితేనే  రష్యాతో యుద్ధంలో జెలెన్ స్కి విజయం సాధించగలుగుతుంది అంటూ జెలెన్ స్కి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 రష్యా తో యుద్ధం జరుగుతున్న సమయం లో ఒకవేల తమకు అమెరికా నుంచి సహాయ సహకారాలు అందకపోయి.  ఉంటే రష్యా చేతిలో తప్పక ఓటమి పాలు అవుతాం  అంటూ చెప్పుకొచ్చాడు. అమెరికా కాంగ్రెస్ తమకు మిలిటరీ సహాయాన్ని ఆమోదించాలి అంటూ జెలెన్ స్కి కోరారు. సహాయం చేయకపోతే తమ దేశం మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తమ దేశం ఓడిపోతే మిగతా దేశాలపై కూడా దాడులు జరుగుతాయి అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా ఇలా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం దాదాపు రెండేళ్ల నుంచి నిరంతరయంగా జరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: