సోషల్ మీడియా డెవలప్ అయినాక చాలా మంది కూడా సెలబ్రిటీలు గా మారిపోయారు. ఇలా సెలబ్రిటీలకు గుర్తింపు పొందిన వారిలో అషు రెడ్డి ఒకరు.

కొద్దిగా సమంత పోలికలు ఉండడంతో అందరూ కూడా ఈమెను జూనియర్ సమంత అంటూ పెద్ద ఎత్తున పొగడ్తలతో అయితే ముంచెత్తారు. ఇలా జూనియర్ సమంతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను అయితే సొంతం చేసుకున్నారు.

ఇలా ఈమెకు సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇక సెలబ్రిటీలను బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే అషు రెడ్డి తనకు వీలు దొరికినప్పుడల్లా టూర్స్ కు వెళ్తూ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఆగ్రా కూడా వెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా ఆగ్రా వెళ్లిన అషు రెడ్డి తాజ్ మహల్ ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనకు కాబోయే లవర్ ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది..ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మించిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈమె షాజహాన్ ను ఆమె ఓ కోరిక కోరింది.ఈ సందర్భంగా ఈ ఫోటోలను అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కట్టించారు.
అలాగే షాజహాన్ లా ప్రేమించే వ్యక్తి తనకు కూడా కావాలని కోరుకున్నారు. హే షాజహాన్ నీలాగే నన్ను ప్రేమించే ఓ వ్యక్తి ని లవర్ గా రావాలని ఆశీర్వదించండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను  పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై కామెంట్ రాయుళ్లు యధావిధిగా కామెంట్లు చేస్తూనే వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: