ఆర్ ఆర్ ఆర్'  చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు రాజమౌళి తన తదుపరిచిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటిసారి వీరి కాంబోలో సినిమా రాబోతుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు మహేష్ సినిమా కోసం రాజమౌళి అదిరిపోయే స్కెచ్ వేశారు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా ఏకంగా హాలీవుడ్ బ్యూటీని దింపబోతున్నట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ తర్వాత వరల్డ్ వైడ్గా రాజమౌళి సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మహేష్ మూవీ వరల్డ్ వైడ్ గా తెరకెక్కబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ ను కూడా జక్కన్న రెడీ చేయిస్తున్నారు. 

ఈ స్క్రిప్ట్ ని రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్రప్రసాద్ డెవలప్ చేస్తున్నారు. రాజమౌళి కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మహేష్ సినిమా మరో స్థాయిలో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో థోర్ మూవీ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా మహేష్ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలతో పాటు టెక్నీషియన్స్ తో కూడా రాజమౌళి చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే ప్రముఖ హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (సి ఏ ఏ) తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కొంతమంది ప్రముఖ హాలీవుడ్ నటీ నటులను మహేష్ సినిమాలో నటించడానికి ఒప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 అయితే త్వరలోనే వీటికి సంబంధించి రాజమౌళి స్వయంగా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏడాది చివర్లో రాజమౌళి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన రాజమౌళి మరి కొద్ది రోజుల్లోనే మహేష్ సినిమా స్క్రిప్ట్ పై దృష్టి సారిస్తారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సుమారు 800 నుండి 1000 కోట్ల భారీ వ్యయంతో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే రాజమౌళి సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: