ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి హీరో కిరణ్ ఏమన్నారు సెబాస్టియన్ మూవీ తన కెరియర్ లోనే ఇది ప్రత్యేక చిత్రమని అలాగే ప్రేక్షకులకు గుర్తుండి పోయే చిత్రమని అతడు పేర్కొన్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా ప్రత్యేకమైనదని, వైవిధ్యభరితమైన పాత్ర అని తెలిపాడు. పక్కింటి కుర్రాడిలా తన పాత్ర ఉందని అందరూ ఖచ్చితంగా ఫీల్ అవుతారని అని అన్నారు.
ఈ సినిమా పై అంచనాలు కూడా బాగానే ఏర్పడుతున్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ కూడా ఈ నెలలో రంగం లోకి దిగుతున్న నేపథ్యంలో పోటీ ఎలా ఉండబోతోంది బాక్సాఫీస్ వద్ద ఎవరు ఎలాంటి ఫలితాన్ని అనుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది.
కాన్సెప్ట్ బాగుంటే పెద్ద సినిమాలు ముందు కూడా చిన్న సినిమాలు బరిలోకి దిగి విజయాన్ని అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ ఉంటే కథను ఆదరించడంలో ఎపుడు ముందుండే మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి ఎన్ని మార్కులు ఇస్తారో చూడాలి. మరి ట్రైలర్ ను బట్టి చూస్తే కథ కొట్టగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సినిమాకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. మరి డైరెక్టర్ ఏ విధంగా కథను తీర్చిదిద్దాడు అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి