
జూన్ 5న విడుదల కాబోతున్న ‘దగ్ లైఫ్’ మూవీ కోసం 70 ఏళ్ల వయస్సులో దేశవ్యాప్తంగా టూర్లు చేస్తూ అనేక ప్రాంతాలకు వెళ్లాడామే కాకుండ అక్కడి మీడియా సంస్థలాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ మూవీ పై క్రేజ్ పెంచడానికి చాల కృషి చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో ‘నాయకుడు’ సినిమా తరువాత 40 సంవత్సరాల గ్యాప్ తో కమల్ నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కమలహాసన్ ప్రకటించిన విషయం సాధ్యం అయ్యే పనేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ విడుదల అయిన తరువాత 8 వారాల గ్యాప్ తరువాత మాత్రమే తమ సినిమా ఓటీటీ లోకి వస్తుందని కమల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
ప్రస్తుత పరిస్థితులలో చాల ఓటీటీ సంస్థలు టాప్ హీరోల సినిమాలు అయినప్పటికీ ఆసినిమాలను కేవలం 4 వారాల గ్యాప్ తో తమ ఓటీటీ యాప్ లలో స్ట్రీమ్ చేస్తున్నాయి. దీనితో చాలామంది సగటు ప్రేక్షకులు భారీ సినిమాల ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా మరొక నెలరోజులు ఓపిక పడితే చాలు హాయిగా తమ ఇంటిలో చూడవచ్చు కదా అన్న ఆలోచనలతో సినిమాలకు రావడం పూర్తిగా తగ్గించి వేశారు.
కమల్ ఆలోచన వాస్తవ రూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయా అంటూ కమలహాసన్ మణిరత్నం ల కాంబినేషన్ మూవీ కావడంతో ఈ మూవీ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మణిరత్నం సినిమాలు తీయలేకపోతున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనికితోడు మితిమీరిన ఆత్మ విశ్వాశంతో ఈ మూవీకి సాంబధించిన తమిళ టైటిల్ తోనే తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం అయి 5 నెలలు గడిచిపోయినప్పటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘కోర్ట్’ ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలి మరే సినిమా చెప్పుకోతగ్గ స్థాయిలో విజయవంతం కాలేదు. దీనితో ప్రేక్షకులు ఈసినిమాకు ఎటువంటి తీర్పు ఇస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది..