హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో అజయ్ దేవ్గన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో అజయ్ దేవ్గన్ , రామ్ చరణ్ కు తండ్రి పాత్రలో నటించాడు.

ఈయన పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువే అయినప్పటికీ ఆయన పాత్రకు మంచి గుర్తింపు ఉండడం , ఆ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే అజయ్ దేవగన్ తాజాగా రైడ్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన రైడ్ 2 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే అజయ్ దేవ్గన్ , రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇప్పటివరకు 13 సినిమాలలో నటించాడు. వీరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఇకపోతే వీరి కాంబోలో 14 వ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో గోల్ మాల్ 5 సినిమా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా ఈ ఇద్దరి కాంబోలో 14 వ మూవీగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటివరకు వీరి కాంబోలో రూపొందిన 13 సినిమాలలో చాలా మూవీ లు మంచి విజయాలను సాధించడంతో వీరి కాంబోలో రూపొందబోతున్న 14 వ సినిమా అయినటువంటి గోల్మాల్ 5 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad