
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నీతి నిజాయితీగా తన పనులను కంప్లీట్ చేసేస్తున్నాడు. కాగా రీసెంట్గా ఏపీ ప్రభుత్వం కుబేర సినిమాకు భారీ గుడ్ న్యూస్ అందించింది. టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న నాగార్జున.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా..కీలక పాత్రలో నటించిన సినిమా "కుబేర". భారీ బడ్జెట్ తో కొత్త కాన్సెప్ట్ తో టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
తెలుగు - తమిళం - హిందీ - మలయాళం - కన్నడ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది . ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . కాగా ఈ సినిమా మరికొద్ది గంటలో రిలీజ్ అవుతుంది అనగా ఏపీ ప్రభుత్వం కుబేర మూవీ టీం కి గుడ్ న్యూస్ అందించింది . ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలపై ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . మల్టీప్లెక్స్ ..సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 75 ప్లస్ జీఎస్టీ అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా కండిషన్స్ కూడా పెట్టింది . సినిమా విడుదలైన తేదీ నుంచి కేవలం పది రోజులు పాటు మాత్రమే ..ఈ ధరలు అమలులో ఉండేలా అనుమతి ఇచ్చింది . పెరిగిన ధరలు జూన్ 30 వ తేది వరకు మాత్రమే అమలులో ఉంటాయి అనమాట. దీంతో ఏపీ ప్రభుత్వం కుబేర మూవీ టీంకు గుడ్ న్యూస్ చెప్పినట్లు అయ్యింది. మరొక పక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ విషయమై చిత్ర బృందం ప్రభుత్వానికి అసలు దరఖాస్తు నే చేసుకోలేదు అంటూ సమాచారం అందుతుంది . దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లల్లో టికెట్లు ధరలు యధా విధంగా ఉండబోతున్నాయి..!!