- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

మంచు విష్ణు రెండు వందల కోట్లతో కన్నప్ప సినిమా తీస్తున్న అన్నప్పుడు విష్ణు మాటలను ఎవరు ? సీరియస్గా తీసుకోలేదు. పాన్ ఇండియా సినిమా చేస్తున్నారని చెప్పినప్పుడు పెద్దపెద్ద స్టార్లు తన సినిమాలో కనిపిస్తారని చెప్పినప్పుడు కూడా ఎవరు దృష్టి పెట్టలేదు. కానీ ప్రభాస్ - మోహన్ లాల్ - అక్షయ్ కుమార్ - కాజల్ ఇలా పెద్ద స్టార్ లని తన టీమ్‌లోకి తీసుకు రాగలిగాడు. క్రమక్రమంగా కన్నప్ప సినిమాపై క్రేజ్ క్రియేట్ చేసి సినిమాపై జనం ఫోకస్ పెంచేలా చేయగలిగాడు. ఇక కన్నప్ప సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో రిలీజ్ అయింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది. విష్ణు తన కెరీర్ లో తీసుకున్న అతిపెద్ద రిస్క్ ఈ సినిమా అని చెప్పాలి. నటుడు గానే కాదు నిర్మాతగాను ఓ సాహసం చేశాడు.


చివరి 30 నిమిషాల్లో విష్ణు నటన తప్పకుండా అందరికీ నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ లో కంటే ఎమోషన్ సీన్ల లో విష్ణు నటన మరింత ర‌క్తి కట్టింది. నిర్మాతగా ఈ సినిమాకు కావాల్సినంత ఇచ్చేసాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోకి ఎప్పుడైతే ప్రభాస్ను తీసుకువచ్చాడో అక్కడే విష్ణు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఏది ఏమైనా సినిమాకు ఫస్ట్ అఫ్ కాస్త ఇబ్బంది అనిపించింది. చాలా సీన్లు ల్యాగ్ అయ్యాయి. అయితే సెకండ్ హాఫ్ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఓవరాల్ గా చెప్పాలంటే క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్ కు ముందు 20 నిమిషాలు సినిమాను నిలబెట్టి సూపర్ హిట్ చేసిందని చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: