సినిమా ఇండస్ట్రీ లోకి ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలా కూతుర్లు హీరోయిన్లుగా కూడా ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కూతుర్లు సినీ పరిశ్రమలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు కాస్త తక్కువ గానే కనిపించిన పక్క పరిశ్రమలలో మాత్రం అనేక మంది స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీ లోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ కూతురు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా అందుకు సంబంధించిన విషయాన్ని స్వయంగా మోహన్ లాల్ వెల్లడించారు.

తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తన కుమార్తె విస్మయ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూడ్ ఆందోని తెరకెక్కిస్తున్న తుడుక్క అనే మూవీ తో ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీ కి పరిచయం కానుంది. ఈ మూవీ లో ఈమె మాయ అనే పాత్రలో కనిపించబోతోంది. ఇకపోతే మోహన్ లాల్ కుమారుడు అయినటువంటి ప్రణయ్ కూడా ఇప్పటికే సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 వ సంవత్సరం విడుదల అయిన హృదయం అనే మూవీ తో ఈయన మంచి సక్సెస్ను కూడా బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా ఇప్పటికే మోహన్ లాల్ కుమారుడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ను కూడా అందుకున్నాడు.

మరి మోహన్ లాల్ కుమార్తె అయినటువంటి విస్మయ మరికొన్ని రోజుల్లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈమె మొదటి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకొని ఏ స్థాయి గుర్తింపును దక్కించుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను పలకరించడం మాత్రమే కాకుండా అద్భుతమైన విజయాలను కూడా అందుకుంటు ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: