
అన్ని పార్టీల నాయకులంతా కూడా ఒక డిమాండ్ సెక్షన్ ఏర్పాటు చేశారు. అక్కడైతే కాశ్మీర్ లో అరెస్టు చేసిన నాయకులందరిని కూడా విడిచిపెట్టాలి. వాళ్ళందరినీ కూడా ప్రజల హక్కులకు భంగం కల్గించకుండా ప్రభుత్వం వివరించాలి. ప్రభుత్వం పైనే బాధ్యత ఉందంటూ కూడా నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీతారామ్ ఏచూరి, డి రాజా అదే విధంగా గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి సంబందించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున హాజరై ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ లో సేవ్ డెమోక్రసీ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులను కాపాడాలి మానవ విలువల్ని కాపాడాలని అదే విధంగా ప్రజాస్వామాన్ని పరిరక్షించాలంటూ కూడా నేతలనంతా కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా జమ్మూకాశ్మీర్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి ఎవరు వెళ్లినా కానీ జమ్ములో అరెస్టు చేయడం వారందరినీ కూడా గృహ నిర్బంధం చేయడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరిని కూడా విడిచిపెట్టాలి. అదే విధంగా జమ్మూకాశ్మీర్ పరిస్థితుల్లో చాలా మంది ప్రజలను అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా తిరిగి ప్రభుత్వం విడిపించాలంటూ దేశ వ్యాప్తంగా ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం జంతర్ మంతర్ పెద్ద సంఖ్యలో ఇక్కడికి సంబంధించిన లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.