
కరోనా వైరస్ వచ్చాక మనిషిలో మానవత్వం చచ్చిపోయింది. ఒకప్పుడు మనిషి అస్వస్థతకు గురయ్యాడు అంటే వెంటనే ఆస్పత్రికి ఫోన్ చెయ్యాలి.. వారిని బ్రతికించాలి అని ఉండేది. కానీ ఇప్పుడు పక్కన ఉన్న మనిషి చచ్చిపోతున్న పట్టించుకోవడం లేదు. అస్వస్థతకు గురయ్యాడు అంటే అమాడు దూరం పరిగెత్తుతున్నారు. ఇంకా ఈ కోవిడ్ సమయంలో అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.
భర్త శవం తోపుడు బండిపై..
నిన్న ఆదివారం కర్ణాటకలోని ఓ వృద్ధురాలు భర్త శవాన్ని తోపుడు బండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు చేసింది. ఆమె భర్తకు కరోనా లేదు అయినప్పటికీ కరోనా భయంతో స్థానికులు కనీసం ఆమెకు అంత్యక్రియలకు కూడా సహకరించలేదు. ఎవరు లేక తోపుడు బండిపైనే ఆమె భర్త అంత్యక్రియలు జరిపింది.
చివరి చూపు కూడా..
పాలస్తీనాకు చెందిన జిహాద్ ఆల్-సువైతి అనే ఓ కుర్రాడి తల్లి కరోనా వైరస్ తో ఆస్పత్రిలో చేరింది. కోవిడ్ ఆంక్షల కారణంగా అతడిని ఆసుపత్రిలోకి అనుమతించలేదు. మరణశయ్యపై ఉన్న తల్లిని చూసేందుకు ఆ కుర్రాడు ఆస్పత్రిపైకి ఎక్కి కిటికీ వద్ద కూర్చున్నాడు. అద్దంలో నుంచి కొడుకుని చూసిన తల్లి కాసేపటికి ప్రాణాలు వదిలేసింది. చివరి ఘడియల్లో ఇలాంటి దుస్థితిలో తల్లిని చూసుకుంటున్న ఆ కుర్రాడి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
మెడికల్ షాప్ ఎదుట యువకుడు మృతి..
ఓ యువకుడు మెడికల్ షాపుకు మందుల కోసం అని వచ్చి తిరిగి వెళ్తుండగా ఆకస్మాత్తుగా కింద పడిపోయి మృతిచెందాడు. కరోనా భయంతో అతడి మృతదేహాన్ని ఏ ఒక్కరూ ముట్టుకోలేదు. దీంతో సుమారు 6 గంటల పాటు మృతదేహం అక్కడే ఉండిపోయింది. ఇంకా ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలోని భగల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇలాంటి దారుణ ఘటనలు ఈ కోవిడ్ కాలంలో ఎన్ని చూడాల్సి వస్తుందో.. ఈ దుస్థితి మరెవరికి రాకూడదు.