
కాగా, 4జీ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) చీఫ్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) సారథి ఫరూక్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల కశ్మీర్ విద్యార్థులు, వ్యాపారులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 4జీ సేవలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని గుప్‌కార్ అలయెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ఆంక్షల ద్వారా పిల్లలు, వ్యాపారవేత్తలు, మిగితా వర్గాల వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఫరూక్ కోరారు
ఇదిలా ఉండగా భారత జవాన్లు ఎన్నిసార్లు తీవ్రంగా హెచ్చరించినా పాక్ వక్రబుద్ధి మారడం లేదు. నియంత్రణరేఖ వెంట కవ్వింపుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిత్యం ఏదోఒక చోట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పెచ్చరిల్లిపోతోంది. కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా బాల్‌కోట్ సెక్టార్‌లో నియంత్రణరేఖ వెంట పాక్ సైనికులు భారత జవాన్లు, సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారు. ఆయుధాలతో కాల్పులు జరిపి, మోర్టార్లతో షెల్లింగ్స్ చేశారు. భారత జవాన్లు ధీటుగా స్పందిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి చోరుబాటుదారులను భారత్‌లోకి పంపి విధ్వంసం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే భారత బలగాలకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యాయి.