ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెగ్యులర్ పాలిటిక్స్ లో మొన్నటి వరకు చాలా సైలెంట్ గా కనబడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులకు కన్నా లక్ష్మీనారాయణ ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా చూడలేక పోతున్నారని ఒక వర్గం అంటుంది. అందువల్లనే ఆయన పార్టీ తరఫున పెట్టే సమావేశాలకు పెద్దగా నాయకులు కూడా హాజరు కావడం లేదని బిజెపి పార్టీ లో టాక్. ఈ పరిణామంతో కన్నా లక్ష్మీనారాయణ ని ఢిల్లీ పెద్దలు అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి రెడీ అయినట్లు ఊహాగానాలు రావడం జరిగాయి. ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో కన్నా లక్ష్మీనారాయణ తన ఉనికి కోసం విశ్వ ప్రయత్నాలు మొదల పెడుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. వాస్తవంగా అయితే కన్నా లక్ష్మీనారాయణ బిజెపి పార్టీలో సిద్ధాంతాల కోసం పార్టీలో చేరలేదు.

 

కొన్ని దశాబ్దాల రాజకీయ జీవిత అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించడం జరిగింది. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలకు సరిగ్గా కొద్ది నెలలు ఉందనగా బిజెపి పార్టీ తీర్ధాన్ని పుచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ బిజెపి పార్టీ లోకి రావడంతో రాష్ట్రంలో కాపు ఓటు వర్గాన్ని కొంతవరకు ప్రభావితం చేయవచ్చని బిజెపి భావించింది. ఇందుమూలంగా పార్టీలో చేర్చుకుంది. కానీ ఉన్న లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కావూరి సాంబశివరావు, మాజీ అధ్యక్షుడు కంభం పాటి హరిబాబు లాంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తొలినుంచి బీజేపీలో ఉండి, హైకమాండ్ వద్ద పట్టున్న సోము వీర్రాజు లాంటి నేతలు సయితం కన్నా లక్ష్మీనారాయణను దూరంగా పెడుతున్నారు.

 

మరోపక్క కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ హైకమాండ్ కి పేరు రాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా నడుచుకోవటం జరుగుతుందని బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఢిల్లీ బీజేపీ హైకమాండ్ కి కన్నా లక్ష్మీనారాయణ అనేక ఫిర్యాదులు వెళ్లడంతో..అధ్యక్ష పదవి నుండి తొలగించే అవకాశం ఉందని వార్తలు బిజెపిలో రావడంతో, వెంటనే కన్నా లక్ష్మీనారాయణ విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేసి...ఉనికిని చాటుకోవడం కోసం ఏపీలో రాజకీయ రగడ కి కొత్త తెరలేపారు అని కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు భావిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: