తాజాగా జరిగిన పోలింగులో ఒక విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే గ్రేటర్ హైదరాబాద్, పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లే చాలా బెటరని. ఎందుకంటే నవంబర్ 30వ తేదీన ముగిసిన పోలింగులో 71.34 శాతం ఓటింగ్  నమోదైంది. అయితే ఇందులో కూడా గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగే చాలా ఎక్కువ. దీని తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్వాలేదన్నట్లుగా రికార్డయ్యింది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ మరీ దారుణంగా పడిపోయింది.





గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటింగ్ సగటు తీసుకుంటే  55 శాతం టచ్ అయ్యిందంతే.   యాకత్ పురాలో అయితే మరీ దారుణంగా 39.64 శాతం మాత్రమే నమోదైంది. దీనికన్నా కాస్త మెరుగ్గా జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, కార్వాన్, నాంపల్లి, మలక్ పేట, ఎల్బీ నగర్, నియోజకవర్గాల్లో 46.56 శాతం నమోదైంది.  చెప్పుకోవటానికి పై నియోజకవర్గాలు ఉన్నత స్ధాయి విద్యావంతులు, విద్యావంతులు, ఐటి ఎంప్లాయిస్, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులుండేవి.





ఇక్కడే ఒక విషయంలో క్లారిటి వచ్చింది. అదేమిటంటే ఓట్లేయని వాళ్ళకి ప్రభుత్వాలను నిలదీసే హక్కులేదని. స్వచ్చంధంగా ఓట్లేసే వాళ్ళకి మాత్రమే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుంటుంది. అంతేకానీ డబ్బులు తీసుకుని ఓట్లేసే వాళ్ళకి, అసలు ఓటింగుకే రాని వాళ్ళకి ప్రభుత్వాలను నిలదీసే హక్కులు ఉండవు గాక ఉండదు. పోలింగ్ రోజున సెలవిచ్చి పోలింగులో పాల్గొనమని కేంద్ర ఎన్నికల కమీషన్ నెత్తి నోరు మొత్తుకున్నది. అయినా చాలామంది ఓటింగుకు రాలేదు.





అందుబాటులోని సమాచారం ప్రకారం రాష్ట్రంమొత్తం మీద 3.27 ఓట్లుంటే  కోట్లుంటే సుమారు కోటిమంది ఓటర్లు ఓట్లేయలేదు. ప్రతి ఒక్కళ్ళు ఓటింగులో పాల్గొని తమకు నచ్చిన పార్టీ లేదా అభ్యర్ధికి ఓట్లేసుంటే బాగుండేది. ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్ధికి ఓట్లేయటం ఇష్టంలేకపోతే కనీసం నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కు ఓట్లేసినా బాగానే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ లేదా పార్టీల మీద జనాలు తమ నిరసనను తెలిపినట్లుండేది. ఎవరికీ వేయకుండా, నోటాకూ వేయకుండానే చివరకు కోటి ఓట్లు మురిగిపోవటం చాలా దారుణం.



మరింత సమాచారం తెలుసుకోండి: