
ముఖ్యంగా ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్బుల మీద తమ పైన చేసిన ఈ ఆరోపణలు నిరూపించాలి అంటూ తాము ప్రశ్నిస్తున్నామంటూ అడిగారు. తమ పైన చేసినటువంటి ఆరోపణలు రుజువు చేయండి లేకపోతే తాము చేతకాని వాళ్ళమని ఒప్పుకోమంటూ తెలియజేశారు. తమ క్యారెక్టర్ పైన ఎవరైనా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదు అంటూ కూడా తెలియజేయడం జరిగింది జక్కంపూడి గణేష్. కాకినాడలో వైసీపీ నేత ఇటీవలే మాట్లాడుతూ.. జక్కంపూడి ఫ్యామిలీ జనసేనలకు వస్తే తమ హవా ఉండదంటూ ఎమ్మెల్యే పంతం నానాజీ చాలా కంగారు పడినట్లుగా కనిపిస్తోందంటూ తెలిపారు.
మా అన్నయ్య జనసేనలోకి చేరాలని కోరినట్లుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినా పంతం నానాజీ చాలా అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో మా కుటుంబం పైన గురించి మాట్లాడేటప్పుడు చాలా బాధపడ్డాము ముఖ్యంగా బెట్టింగ్, ల్యాండ్ మాఫియా వంటివి బ్లెం చేసేలా తమ పైన ఆరోపణలు చేయడం చాలా బాధగా అనిపించింది.. కానీ వాటిని నిరూపించమని ప్రశ్నిస్తున్నామని మాపై చేసిన ఈ ఆరోపణలు రుజువు చేయాలి లేకపోతే తమ పైన మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా తప్పు అని ఒప్పుకోవాలి అంటూ జక్కంపూడి గణేష్ ఫైర్ అయ్యారు. ఇకమీదట ఎవరూ కూడా తమ క్యారెక్టర్స్ పైన పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ తెలియజేశారు. మరి ఈ విషయాలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.