గర్భధారణ సమయంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో డెలివరీ తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ తరువాత ప్రతి తల్లి జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సిన అంశం బ్రెస్ట్ ఫీడింగ్. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం కోసం తల్లి పాలు చాలా అవసరం. అయితే అలాంటి సమయంలో కొన్ని తినకూడని పదార్దాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దామా.

అయితే చాలా మంది చాక్లేట్లు ఇష్టంగా తింటారు. మానేయడం కొంచెం కష్టమే. కానీ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే దశలో మరి ఎక్కువగా చాక్లేట్లు తినకపోవడం మంచిది. చాక్లేట్ లో ఉండే కొన్ని పదార్ధాలు మీ రొమ్ముల్లో పాల వుత్తపతిని  తగ్గిస్తాయి. పిల్లలకు అలెర్జీ లు కూడా కలిగించచ్చు. ఇక బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఆవు పాలు కానీ దానికి సంబంధించిన ఉత్పత్తులు కానీ తీసుకోకండి. ఆవు పాలలో ఉండే ప్రోటీన్లు పిల్లలకు పడవు. అలాంటి సమయంలో పిల్లలకు ఎక్జిమా చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, మలబద్దకం, లాంటి సమస్యలు ఎదురువుతాయి. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఆవు పాలకు దూరంగా ఉండండి.

అయితే చాలా మంది డాక్టర్స్ కూడా, పిల్లలకు పాలిచ్చే తల్లులను సముద్ర చేపలు తినవద్దని చెప్తారు. ఎందుకంటే సముద్ర చేపలలో మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది. మెర్క్యూరీ విషపదార్ధం. మీరు తీసుకునే చేపలలో ఉండే మెర్క్యూరీ, మీ పాల ద్వారా పిల్లలకు కూడా చేరుతుంది.  ఇది పిల్లల ఎదుగుదల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అలవాటు లేని వాళ్లకు ఏ ప్రమాదం లేదు కానీ అలవాటు ఉన్న వాళ్ళు వెంటనే మానేయండి.

అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం, పిల్లల పై కలిగే తీవ్రమైన పరిణామాలకు కారణం అవుతుంది. పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుంది. పిల్లలు ఎప్పుడు మందంగా ఉంటారు. ఇలాంటి సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు తినకండి. ఈ ఆహారాలు పాడైపోకుండా ఉండదానికి వాటిలో ప్రిజర్వేటివ్స్ - కొన్ని రకాల కెమికల్ కలుపుతారు. అవి పిల్లలకు అలెర్జీ లు కలిగించచ్చు. ఈ దశలో ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.





మరింత సమాచారం తెలుసుకోండి: