రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యువత అంతా క్రేజ్ కోసం ఓవర్ స్పీడ్ వెళ్తారు.. దాని ఫలితం తిరిగి రాని లోకాల కు వెళ్లిపోతున్నారు.. ఈ ప్రమాదాల ను అరికట్టడాని కి ట్రాఫిక్ పోలీసులు కఠిన మైన రూల్స్ ను అమలు చేస్తున్నారు.. ముఖ్యంగా ద్విచక్ర వాహనం పై వెళ్ళే వాళ్ళు హెల్మెట్ తప్పనిసరి గా వాడాలని ఆంక్షలు విధించారు. అయితే ఈ రూల్ ను కొందరు మాత్రమే అమలు చేస్తున్నారు..


పోలీసుల కు భయపడి కొందరు ఏదొక హెల్మెట్ ను వాడుతున్నారు.. అది చాలా ప్రమాదం అని కేంద్రం వెల్లడించారు. నాణ్యత లేని హెల్మెట్ల ను నిషేధించింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ ఉన్న ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్) మార్క్ ఉన్న హెల్మెట్లు మాత్రమే కొనాలని హెచ్చరించింది.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం జూన్ 1 నుంచే అమలు లోకి వచ్చింది. అందువల్ల దేశంలో కచ్చితంగా బీఐఎస్ గుర్తింపు ఉన్న ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ల ను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పుకొచ్చింది.


నాణ్యత లేనటువంటి ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ల ను, డూప్లికేట్ ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ల ను వాడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ఫైన్ మాట పక్కన పెడితే మన ప్రాణాల కు గ్యారెంటీ ఉండదు.. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు అవి కాపాడలేవు.. ఇది ముఖ్యం గా గుర్తించాలి. గవర్నమెంట్ విడుదల చేసిన నోటిఫికెషన్ ప్రకారం.. నాన్ ఐఎస్ఐ హెల్మెట్ల ను తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, దిగుమతి చేసుకోవడం వంటివి శిక్షార్హం. ఇలా చేస్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా కట్టాలి.. ఆగండి.. అంతటి సరిపోదు.. ఏడాది పాటు జైలు జీవితాన్ని గడపాల్సిందే.. చూసారుగా.. తస్మాత్ జాగ్రత్త సుమీ..

మరింత సమాచారం తెలుసుకోండి: