ఎన్నికల విషయంలో శేషన్ చేసిన సంస్కరణలు దేశంలో ఎవరూ చేయలేరనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఎన్నికల కమిషన్ ఒక సంచనల నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంతటి వృద్దులైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాల్సిందే. కానీ ప్రస్తుతం కర్ణాటకలో జరగబోయే ఎలక్షన్స్ లో 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే నూతన అవకాశం ఎలక్షన్ కమిషన్ తీసుకురానుంది. ఓటు వేయాలనుకున్న 80 ఏళ్ల వృద్ధుల ఇంటికి ఒక ఫారాం పంపిస్తారు. అందులో ఓటు వేయొచ్చు. అది అత్యంత రహస్యంగా ఉంచుతారు.


దీన్ని ప్రస్తుతం ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 80 ఏళ్లు పైబడిన వారికి సాక్ష్యం అనే మొబైల్ యాప్ లో అప్లై చేసుకుంటే ఫాం 12 పేపర్ ఇస్తారు. అందులో ఓటు వేయొచ్చు. వీడియో రికార్డింగ్ చేస్తారు. వేరే ఏ వ్యక్తి ఓటు వేయకుండా కట్టుదిట్టంగా భద్రత ఉంటుందన్నారు.


ఒకప్పుడు పోలింగ్ బూత్ వద్దకు వెళితే పార్టీలకు సంబంధించిన సింబల్ తో టెంట్స్ వేసుకునే వారు. ఆ స్టిప్పులను కూడా అక్కడ తీసుకునే వారు. దీంతో ఏ పార్టీ టెంట్ వద్ద ఎక్కువ మంది ఉన్నారనే విషయం ఇట్టే తెలిసిపోయేది. కానీ శేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రానికి సమీపంలో పార్టీల గుర్తులతో ఉన్న ఏ ప్రచారం ఉండకూడదని తెగేసి చెప్పింది.


దీంతో 100 మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల కార్యక్రమాలు నిలిచిపోయేవి. గుర్తులు ఉండేవి కావు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ఇంకా టెంట్ లు కూడా ఎన్నికల సంఘం వేయాలని ఆయన సూచించారు. కానీ ఎన్నికల సంఘం వద్ద డబ్బులు లేకపోవడంతో 100 మీటర్ల దూరం దాటిపోయిన తర్వాత ఆయా పార్టీలు టెంట్లు వేసుకోవచ్చు. ఓటర్ల స్లిప్పులు ఇవ్వొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: