టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగులో టాప్ రేంజ్ చూసింది. తమిళ్ సినిమాల్లోనూ రాణించింది. లక్ష్మీ కల్యాణంతో ఎంట్రీ ఇచ్చినా మగధీర సినిమాతో ఒక్కసారిగా టాప్ లీడ్ లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని కాజల్ దాదాపు దశాబ్దంపాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఏలేసింది. కెరీర్ పరంగా తిరుగులేని స్టార్ డమ్ చూసిన కాజల్ ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. పెళ్లి అనౌన్స్ చేయడం, జరిగిపోవడం చకచకా జరగిపోయాయి. కాజల్ పెళ్లి జరిగింది అనేలోపే మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.



అక్టోబర్ 29న పెళ్లి చేసుకున్న కాజల్ ఇప్పుడు నిజంగానే ఇంటికి యజమానురాలైంది. భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి తాను ఉండబోయే కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసింది. భర్తతో కలిసి కొత్త ఇంట్లో జరుపుతున్న పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలా కాజల్ వరుసగా గుడ్ న్యూస్ చెప్తూనే ఉంది. జూన్ లో జరిగిన ఆమె నిశ్చితార్ధం వేడుక గురించి పెళ్లయ్యాక కాజల్ వెల్లడిస్తే కానీ ఎవరికీ తెలీలేదు. అంత గుట్టుగా ఉంచడం గొప్ప విషయం. సినీ కెరీర్లో పీక్స్ చూసిన కాజల్ ఇప్పుడు లైఫ్ లో కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.


కాజల్ పెళ్లి ఫొటోలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. సంప్రదాయ దుస్తుల్లో కాజల్ - గౌతమ్ మెరిసిపోయారు. కాజల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది. వీటిలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ‘ఆచార్య’ సినిమా ఒకటైతే.. తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ సినిమా ఒకటి. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తానని గతంలోనే ప్రకటించింది ఈ బంతిపూల జానకి.


మరింత సమాచారం తెలుసుకోండి: