రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయనకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటు వంటి బాహుబలి సీరీస్ మూవీ లతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. ప్రస్తుతం ఈ హీరో కు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. దానితో ప్రభాస్ ఏ సినిమాలో నటించిన ఈ సినిమాపై అవలీలగా అంచనాలు తారా స్థాయిలో పెరిగి పోతున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో కనిపించబోతున్నారు.  రవి బుశ్రుర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి ప్రభాస్మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ... "కే జి ఎఫ్" సిరీస్ మూవీ లతో దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో  ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ప్రభాస్మూవీ కి సంబంధించిన తన భాగం షూటింగును కంప్లీట్ చేసుకున్నాడట. కాకపోతే ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మొదటి భాగంలో ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ తాజాగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: