ప్రపంచంలో ప్రసిద్ధమైన చాలామంది వ్యక్తులు ఎందుకు ప్రసిద్ధులు అయ్యారు అన్న విషయాలను విశ్లేషిస్తే ఒక లక్ష్యం పై స్పష్టమైన ఏకాగ్రత ఉన్న వ్యక్తులు మాత్రమే విజయాన్ని సాధించ గలుగుతారు అన్న వాస్తవాలు మనకు అర్ధం అవుతుంది. బిల్ గేట్స్ తన ఏకాగ్రతతో విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ విషయం పై ఎంతో ఏకాగ్రతతో పనిచేసిన తరువాత మాత్రమే అతడు విజయం సాధించి ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ ధనవంతుడుగా గుర్తింపు పొందగలిగాడు.


ఇలా ఎందరో తమ ఏకాగ్రతతో మాత్రమే విజయాన్ని సాధించారు. చాలామంది తమ జీవితంలో పరాజయం చెందినప్పుడు కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. అలా కారణాలు చెప్పే వ్యక్తులు వారి జీవితానికి సంబంధించి ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతను ప్రదర్శించ లేకపోయారు అన్నది వాస్తవం.


విజయం అనేది ఒక ఆలోచన ఆ ఆలోచన సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంచుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయగలుగుతాము. ధనాన్ని పొదుపు చేసేవారు అందరు భవిష్యత్ లో ధనవంతులు కాలేరు. కేవలం ఏకాగ్రత ప్రదర్శించే వారు మాత్రమే ధనవంతులు అవుతారు. మన జీవిత లక్ష్యాలు ఎప్పుడు ఒకే విధంగా స్థిరంగా ఉంచుకున్న వారు ధనవంతులు కాలేరు.


మన లక్ష్యాలను మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ఎదగాలి అంటే మనకు విపరీతమైన ఏకాగ్రత ఉండాలి. ఒక స్థిరమైన ప్రధాన లక్ష్యం పట్ల ఎప్పుడు కేంద్రీకృతంగా మనం అడుగులు వేయడమే ఏకాగ్రత. ఈ ఏకాగ్రత బయటకు కనిపించదు కేవలం మన వృత్తి నైపుణ్యాలలో మనం అనుసరించే కృషిలోనే ఈ ఏకాగ్రత కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఒక రంగంలో రాణించినప్పటికీ మరొక రంగంలో ఫెయిల్ అవ్వడానికి ఈ ఏకాగ్రత లోపమే అని అంటారు. మన మనసును ఒక బిందువుగా కేంద్రీకరించి మన శక్తిని అంతా ఒకచోట చేర్చి దానిని సమన్వయ పరిచి పని చేయగలగడమే ఏకాగ్రత. ఈ లక్షణం ఉన్న వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలుగుతాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: