ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అంతా తమ వయసుకు మించిన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా తమ అభిమానులను మెప్పించేందుకు అనేక రకమైన కష్టాలను పడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి వారిలో టాప్ లో ఉంటారు నందమూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి. వీళ్లిద్దరికీ ఆరు పదుల వయసు దాటినప్పటికీ ప్రస్తుతం కూడా హీరోలకు పోటీగా యాక్షన్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. మరో రెండేళ్లు పూర్తయితే చిరంజీవికి ఏడుపదుల వయస్సు చేరుకుంటుంది. 

ఇక ఈ వయసులో కూడా తన అందంతో, ఫిజిక్ తో కుర్ర హీరోలకు పోటీ గా నిలుస్తున్నాడు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో మరియు ప్రెస్ మీట్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి సంచలనమైన విషయాలను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నేను నటించడం కోసమే కెమెరా ముందుకు వచ్చాను..

నేను కెమెరా ముందు ఉన్నంతవరకు నటుడిగా ఎంత దూరం వెళ్లెందుకైనా రెడీ..నా షూటింగ్ పూర్తయ్యాక నా బాధలేవో నేను పడతాను అని.. అభిమానులను అలరించేందుకు షూటింగ్లో ఎంత బాధ అయినా పడతాను అని.. అంత బాధ అనుభవిస్తేనే దానికి అసలైన ఔట్పుట్ వస్తుంది అని.. చెప్పుకొచ్చాడు చిరంజీవి. నేను సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాను అని..నాకు అనిపించిన ఆ క్షణమే నేను సినిమాల నుండి తప్పకుంటా అని చెప్పుకొచ్చాడు  మెగాస్టార్ చిరంజీవి. ఒకవేళ మనకు చేతకాకపోతే అప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడమే చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక అలాంటి రోజు ఒక నటుడు జీవితంలో అసలు రాకూడదు అని.. మనమందరం ఈ సినిమా ఇండస్ట్రీకి కష్టపడడానికి వచ్చాము అని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని ఉండాలనే అలా జరగదు అనుకున్నప్పుడు గెట్ లాస్ట్ ఫ్రొం ఇండస్ట్రీ అని.. ఎలాంటి అభ్యంతరం లేకుండా వాళ్ళు ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవచ్చు అని చెప్పుకొచ్చాడు చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: