నిర్మాత తనయుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన జగపతిబాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ హీరోగా ఇక అందరికీ దగ్గరైపోయాడు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో సినిమా పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకోలేక ఇక అవకాశాలు లేక కనమరుగైపోయాడు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఇక విలన్ గా అవతారం ఎత్తి ఆకట్టుకున్నాడు.


 మనం ఒకప్పుడు చూసిన ఫ్యామిలీ హీరో ఏంటి ఇక ఇప్పుడు విలన్ అవడం ఏంటి అని ముందు అందరూ షాక్ అయ్యారు. కానీ అతని విలనిజం చూసిన తర్వాత విలన్ అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అయితే కేవలం విలన్ గా మాత్రమే కాకుండా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంటున్నాడు. ఏ పాత్ర ఇచ్చిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ తన నటనతో విశ్వరూపం చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. సాధారణంగా కొంతమంది నటులు  తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏకంగా కొంతమంది అయితే సినిమాల కోసమే సిక్స్ ప్యాక్ లు చేయడం కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాము అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు జగపతిబాబు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారిపోయింది. మీ వయసు ఎంత పెరిగిన ఇంకా కుర్రాడు లాగానే కనిపిస్తున్నారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు వారి మాటలను నిజం చేసేందుకు జగపతిబాబు రెడీ అయ్యాడట. ఆయన ముఖానికి మేకప్ వేసుకుని ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్ ని ముఖంపై కప్పుకొని కనిపించాడు జగపతిబాబు. ఇంతకుముందు నా ఫోటో చూసి కుర్రాడిలా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. అందుకే నేను నిజంగానే కుర్రాడులా మారిపోదాం అని ట్రై చేస్తున్న అంటూ ఒక ఫన్నీ కామెంట్ కూడా రాసుకోచ్చాడు జగపతిబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: