ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన ఏలూరి సాంబశివరావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షంలో ఉన్నప్పుడు తన తీరును ఏమాత్రం మార్చుకోకుండా ప్రజలకు అంకితభావంతో కూడిన సేవలను అందిస్తు న్నారు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు అధికార పక్షంలో ఉంటే ఒకరకంగా ప్రతిపక్షంలో ఉంటే మరోరకంగా వ్యవహరించడం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు పట్టించుకుంటారు. వారికి అండగా కూడా ఉంటారు . ఇది రాజకీయ నాయకుల సహజ లక్షణం. అదే నాయకులు అధికారంలోకి వస్తే అనుసరించే విధానం వేరేగా ఉంటుంది.


తమకు అధికారం ఉందని తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చాలామంది నాయకులు భావిస్తారు. దీంతో ప్రజల పట్ల వారి సమస్యల విషయంలోనూ ఒకంత నిర్లిప్త‌తో, నిర్ల‌క్ష్య‌మో క‌నిపిస్తుంటుంది. గత వైసిపి హయాంలో ప్రతిపక్షంలో ఉన్న ఏలూరి సాంబశివరావు... ఇప్పుడు అధికార పక్షానికి వచ్చినా ఆయన తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. నిత్యం ప్రజలకు చేరువుగా ఉండటం, వారి సమస్యలు గుర్తించి వెంట‌నే ప‌రిష్క‌రించ‌డం... నియోజ‌క‌వ‌ర్గంలో ధీర్ఘ‌కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న సమస్యలను ఓపికగా వినడం వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించటం వంటివి ఏలూరి సాంబశివరావు రాజకీయ చాతుర్యాన్ని నాయకత్వ లక్షణాలను ప్రత్యేకంగా చాటుతున్నాయి.


వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఏలూరి సాంబశివరావు రైతులకు మరింత చేరువ అయ్యారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు క‌రోనా టైంలో కూడా విదేశాల్లో స్థిర‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గ ఎన్నారైల దాతృత్వం ద్వారా రైత‌లుకు ర‌క‌ర‌కాల వ్య‌వ‌సాయ ప‌నిముట్లు ఇప్పించారు. ఇక ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ చ‌క‌చ‌కా పూర్త‌య్యేలా చూస్తున్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది. అయినా ప్రజల పక్షాన, రైతుల పక్షాన అలుపెరుగని కృషి చేశారు. ఇది ఏలూరు సాంబశివరావును ప్రజల మనసులో నిలిచేలా చేసింది. వరుస విజయాలు ప్రజల అభిమానం చూరగొన్న ఏకైక నాయకుడిగా గత దశాబ్ద కాలంలో ఏలూరు సాంబశివరావు పేరు చిరస్థాయిగా నిలబడింది.


వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి నాయకులు అనేక కేసులు ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందులు కూడా పడ్డారు. అసలు మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న ఆవేదనతో కూడా ఉన్నారు. కానీ ఏలూరి సాంబశివరావు మాత్రం సమస్యలను ప్రస్తావిస్తూనే ఎటువంటి విమర్శలకు వివాదాలకు అవకాశం లేకుండా తన స్థాయిలో ప్రజలకు చేరువయ్యారు. ఒకానొక సందర్భంలో స్వచ్ఛంద సేవ సంస్థలను ఆశ్రయించి వారి సహాయంతో కూడా రైతులకు, ప్ర‌జ‌ల‌కు మేలు చేశారు. అందుకే ఏలూరి సాంబశివరావు నేటికీ ప్రజల్లో ఒక ఐకానిక్ లీడర్ గా నిలిచిపోయారు.


ఆయనకు పదవుల ఆకాంక్ష లేదు పదవి కోసం పనిచేయట్లేదు. ప్రజలు గెలిపించారు ప్రజల కోసం పనిచేయాలి అన్న ఒకే ఒక ఆకాంక్ష ఏలూరిని ముందుకు నడిపిస్తోంది. ఇదే ఆయనకు అత్యధిక బలంగా రాజకీయ స్థిరంగా కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఈ పరంపరలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయనకు బలమైన గుర్తింపు రావాలని కోరుకునేవారు ఎందరో ఉన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయటమే తన రాజకీయ లక్ష్యం అని చెప్పే ఏలూరి అత్యంత నిరాడంబరుడు. అత్యంత వివాద రహితుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల వారీ రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: