నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో నాని తన అభిమానుల ముందుకు వస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే నాని కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి సక్సెస్ సాధించారు. రీసెంట్ గానే నాని "కోర్ట్" సినిమాను నిర్మించారు. నాని నిర్మాణం వహించిన కోర్ట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


 అంతేకాకుండా ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా నిర్మించారు. ఎవరు ఊహించని విధంగా రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ భారీగా కలెక్షన్లను రాబట్టింది. కాగా, కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వ్యవహరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో హీరో నాని డైరెక్టర్ రామ్ జగదీష్ తో కలిసి మరో సినిమాను నిర్మించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించే అవకాశాలు ఉన్నాయి.

ఇదివరకే ఈ హీరో తెలుగులో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం, హిందీలో అనేక సినిమాలలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. రీసెంట్ గానే దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. దీంతో నాని నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక చేసే పనిలో హీరో నాని బిజీగా ఉన్నారట. కీర్తి సురేష్ ను హీరోయిన్ గా పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: