కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత అటు సినీ ఇండస్ట్రీకి కూటమి ప్రభుత్వానికి వారధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ హీరోల చిత్రాలు కూడా విడుదలయ్యాయి. అయితే ముఖ్యంగా ముగ్గురు బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలకు కూడా కూటమి ప్రభుత్వం మేలు చేసింది. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు బెనిఫిట్ షో లతో పాటు , టికెట్ల రేటును పెంచుకునే సదుపాయాన్ని కూడా కనిపించింది. మరొక హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల ధరలను కూడా అధికంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే హీరో నాగచైతన్య నటించిన తండేల్ సినిమాకి కూడా అన్ని రకాల సదుపాయాలని కూటమి ప్రభుత్వం కల్పించారు. ఇలా ముగ్గురు హీరోలకు కూడా కూటమి ప్రభుత్వం మంచి చేసిన.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసుని సైతం కొంతమంది నిర్మాతలు నొప్పించారు.


అయితే నాగార్జున ఇన్ డైరెక్ట్ గా వైసీపీ పార్టీకి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.. అయినా కూడా కూటమి ప్రభుత్వం అలాంటివేవీ పట్టించుకోకుండా నాగచైతన్య సినిమాకి టికెట్ల రేటును బెనిఫిట్ షోలను కూడా అందించింది. పుష్ప 2 సినిమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి దాదాపుగా ఎదురైనప్పటికీ కూడా అన్నిటికీ సానుకూలంగానే పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. కానీ తీర తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతున్న సందర్భంలో జూన్ 1వ తేదీన థియేటర్లు మూసివేసేలా పలువురు నిర్మాతలు , థియేటర్లు యాజమాన్యం చేస్తున్నారని తెలిసి పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారు. ఈ విషయం పైన హర్ట్ కావడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీకి రాజకీయానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదని తాను అన్ని విధాలుగా సపోర్ట్ చేసినప్పటికీ అందుకు సినీ ఇండస్ట్రీ నుంచి తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని మాట్లాడారు.


ఇకమీదట సినీ ఇండస్ట్రీ కి సంబంధించి ఎలాంటి చర్చలు జరిపేవి ఉండవని.. సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ తో సినిమా థియేటర్లలో జరిగే అక్రమాల పైన ఎంక్వైరీ  చేయించేలా, అలాగే పన్నుల విషయంలో కూడా కడుతున్నారా లేదా అనే విషయాల పైన ఎంక్వయిరీ చేయిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: