
టాలీవుడ్ అగ్ర నిర్మాత .. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు టాలీవుడ్ లో ఉన్న ఫేక్ రికార్డుల గుట్టు విప్పారు. తాజాగా ఆయన నిర్మించిన తమ్ముడు సినిమా వసూళ్లు ఒరిజినల్.. రికార్డులు ఒరిజినల్ అని చెప్పుకున్నారు. ఇకపై తన సినిమాల యూట్యూబ్ ఒరిజినల్స్ మాత్రమే చెప్తామని తెలిపారు. తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్న దిల్ రాజు ఆ సినిమా యూట్యూబ్ న్యూస్ విషయంలో ఒరిజినల్ నెంబర్స్ మాత్రమే చెబుతానని అంటున్నారు. తమ్ముడు ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్ అన్ని ఒరిజినల్గా... ప్రేక్షకులకు ఎంతమంది చూశారో ఆ నంబర్ మాత్రమే అక్కడ ఉండాలని తన టీంకు చెప్పినట్టు తెలిపారు. డబ్బులు పెట్టి వ్యూస్ కొనవద్దని చెప్పాను... అలా కొనటం వల్ల ఒరిజినల్ గా ట్రైలర్ లేదా సాంగ్ ఎంత రీచ్ అయిందో తెలియటం లేదన్నారు.
మిలియన్ల కొద్ది వ్యూస్ అంటూ ఘనంగా చెప్పుకుంటున్నాము... తప్ప ఒరిజినల్ గా ఎంతమందికి రీచ్ అయిందో ?తెలియటం లేదని ఫలితంగా ఆ ప్రభావం సినిమాపై పడుతోందని దిల్ రాజు తెలిపారు. అందుకే ఇకపై తన సినిమాలకు టీజర్లు.. ట్రైలర్లు ఇతర అప్‌డేట్ల విషయంలోకి ఫేక్ వ్యూస్ వద్దు అని తమ్ముడు సినిమాతో తెలుగు అడుగు వేశానని దిల్ రాజు తెలిపారు. ఏదేమైనా టాలీవుడ్ లో టీజర్లు .. ట్రైలర్ల వ్యూస్ లో ఎంత ఫేక్ ఉందో రాజు మొత్తానికి ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు