మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలో అరెస్ట్ కానున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే జగన్ పై పలు ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలు నిజమని ప్రూవ్ చేసేలా పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరిస్తున్నారని సమాచారం అందుతోంది. సాక్ష్యాల సేకరణ పూర్తైన తర్వాత జగన్ అరెస్ట్ అనివార్యం అని సమాచారం అందుతోంది.
 
ఎప్పుడు జగన్ అరెస్ట్ జరిగినా రాష్ట్రంలో ఈ అరెస్ట్ ఒకింత సంచలనం అవుతుంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయంగా పెను సంచలనాలకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లిక్కర్ కుంభకోణం గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగే విధంగా మీడియ సైతం వ్యవహరిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
అయితే ఈ కేసులో అరెస్ట్ కావడం జగన్ కే ప్లస్ కానుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ ను విమర్శించే వాళ్లు సైతం జగన్ అరెస్ట్ తర్వాత ఆయనకు పాజిటివ్ గా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. జగన్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాలి.
 
ఏపీ మాజీ సీఎం జగన్ కు కష్టాలు మాత్రం తొలగిపోవడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంటు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు ప్రస్తుతం కుటుంబ సభ్యుల సపోర్ట్ అయితే లేదనే సంగతి తెలిసిందే. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. జగన్ కు భవిష్యత్తులో మరిన్ని షాకులు తగులుతాయేమో చూడాలి. 2029 నాటికి వైసీపీ ఉంటుందా లేదా అనే చర్చ సైతం జరుగుతోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: