నారా చంద్రబాబు నాయుడు కుమారుడు అయినటువంటి నారా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించి చాలా కాలమే అవుతుంది. 2019 వ సంవత్సరం ఈయన వై సి పి పార్టీ అభ్యర్థిపై ఓడిపోయాడు. దానితో ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు అయి ఉండి కూడా ఓడిపోవడంతో ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన ఆ ఓటమిని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలకు దగ్గర అవుతూ వచ్చాడు. దానితో ఆయనపై పాజిటివిటీ చాలా ఎక్కువ శాతం పెరిగింది. ఇక 2024 వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఈయన భారీ మెజారిటీతో గెలుపొందాడు.

ఈయన గెలుపొందాక ఈయనకు విద్యాశాఖ మంత్రి పదవి బాధ్యతలను ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఆయన అనేక సమస్యలపై పోరాడడం మాత్రమే కాకుండా విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన స్థాయిలో ఎదగడం కోసం ఎంతో కృషి చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా భీమవరంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నారా లోకేష్ స్పందించాడు. తాజాగా భీమవరంలో పట్ట పగలు కొంత మంది కలిసి విద్యార్థులపై దాడి చేశారు. ఇలా దాడి చేసిన సంఘటన ఎంతో కలిసివేసింది. అలా దాడి చేసిన వారందరినీ ఖచ్చితంగా శిక్షించాలి అని నారా లోకేష్ , భీమవరం డీజీపీ ని కోరారు.

పౌర సమాజంలో ఇలాంటి ప్రవర్తన అస్సలు ఆమోదయోగ్యం కాదు అని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను అస్సలు చూస్తూ ఉండదు అని , ఇలా చేసిన వారికి తగిన శిక్ష పడేలా చూస్తుంది అని ఆయన తెలిపారు. భీమవరంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నారా లోకేష్ లాంటి ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి స్పందించడంతో విద్యార్థులపై దాడి చేసిన వారికి త్వరగా శిక్ష పడే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: