
న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో భాగంగా డబుల్ సెంచరీ, సెంచరీ తో కలిపి మొత్తంగా 360 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎన్నో అరుదైన రికార్డులను కూడా కొల్లగొట్టాడు. ఇకపోతే ఇటీవలే అదిరిపోయే ప్రదర్శన చేసిన శుభమన్ గిల్ ను కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇంటర్వ్యూ చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో గెలు ప్రదర్శన చూసి అతని తండ్రి తప్పకుండా గర్వపడుతూ ఉంటాడు అంటూ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. అయితే మొన్నటి వరకు గిల్ అర్థ సెంచరీలు చేసి ఇక వాటిని సెంచరీలుగా మార్చడంలో విఫలం అయిన సమయంలో నువ్వు కేవలం చిరుజల్లులను మాత్రమే చూపిస్తావా.. ఉరుములు మెరుపులతో వర్షాన్ని కురిపించలేవా అంటూ అతని ఆటపై గిల్ తండ్రి కామెంట్ చేసి ప్రోత్సాహించి ఉంటాడు అంటూ రాహుల్ ద్రవిడ్ కామెంట్ చేశాడు.
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం నిజంగానే నువ్వు ఉరుములు మెరుపులు మెరిపించి చివరికి భారీ వర్షాన్ని కురిపించావు అంటూ ప్రశంసించాడు రాహుల్ ద్రావిడు. ఇక నీ ఆట తీరు చూసి మీ నాన్న తప్పకుండా గర్వపడుతూ ఉంటాడు అంటూ పేర్కొన్నాడు. అయితే తర్వాత గిల్ మాట్లాడుతూ.. నా సెంచరీ తో నా తండ్రి సంతోషపడతారని నేను అనుకోవట్లేదు. ఈ మ్యాచ్ లో నేను ఇంకా కొనసాగి ఉండాల్సింది. ఆయన నాకు కచ్చితంగా ఇదే చెబుతారు. క్రీజు లో ఇంకాసేపు ఉంటే మరో భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నించే వాడివి అంటూ తప్పకుండా చెబుతారు అని గిల్ చెప్పుకొచ్చాడు..