ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అద్భుతమైన ఆల్ రౌండర్లలో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తన ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్ధులను వణికించడమే కాదు ఇక బ్యాట్స్మెన్ గా కూడా ఎప్పుడు సత్తా చాటుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇలా ఆల్రౌండర్ గా అత్యుత్తమ ప్రదర్శన చేయడం కారణంగానే ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్లో స్టార్ క్రికెటర్లలో ఒకటిగా కొనసాగుతూ ఉన్నాడు. అంతేకాదు ఇక ఇంగ్లాండ్ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వహించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి.


 ఇక ఇటీవల కాలంలో టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టు దూకుడు అయిన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు బెన్ స్టోక్స్ సైతం తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించి జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తన ప్రదర్శనలతో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల మరో రేర్ రికార్డుని సాధించాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.  ప్రస్తుతం న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు తమ దూకుడైన ఆటతీరుతో పూర్తి ఆదిపత్యాన్ని కనబరిస్తుంది.



 ఇకపోతే ఇటీవలే తన బాటిల్తో అదరగొట్టిన బెన్ స్టోక్స్ ఒక రికార్డు సృష్టించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 90 మ్యాచ్లలో 108 సిక్సర్లు కొట్టాడు బెన్ స్టోక్స్. దీంతో న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ ఇంగ్లాండ్ కోచ్ అయినా మెకళ్లమ్ పేరిట ఉన్న రికార్డును బెన్ స్టోక్స్ బద్దలు కొట్టేశాడు అని చెప్పాలి. మేకల్లమ్ నూట ఒక్క మ్యాచ్ లలో 107 సిక్సర్లు కొడితే బెన్ స్టోక్స్ 90 మ్యాచ్లలోనే ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్థానంలో క్రిస్ గేల్ 100 సిక్సులు, ఆడమ్ గిల్ క్రిస్ట్ 98, కల్లీస్ 97 సిక్సర్లతో  ఉన్నారు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన బెన్ స్టోక్స్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: