మనిషికి అతికి మించిన కోపం ఉంటే అది వారి విజయానికి కూడా అడ్డుగా నిలుస్తుంది. మన కోపమే మన శత్రువు మన శాంతమే మనకు రక్ష అన్నారు పెద్దలు. ప్రేమ, జాలి, కరుణ వంటి భావాలతో పాటు కోపం కూడా ఒక భావమే, సందర్భాన్ని బట్టి ఒక్కో భావాలు బయటకు వస్తుంటాయి. ప్రతి మనిషి అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండాలని లేదు ఆయా సందర్భాన్ని బట్టి హావభావాలు బయటకు వస్తుంటాయి. అలాగే మనకు నచ్చని విషయం తెలిసినపుడు, జరిగినపుడు మనకు కోపం వస్తుంది. అలాంటప్పుడు వెంటనే మన కోపాన్ని ముందు వెనుక ఆలోచించకుండా వ్యక్తపరుస్తూ ఉంటాము. ఏ భావాన్ని అంత సులభంగా కంట్రోల్ చేసుకోలేక ముఖ్యంగా కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు చాలామంది.

అయితే ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. కోపాన్ని వ్యక్త పరచడం సరే, అది అలా బయటకు వచ్చేస్తుంది. కానీ ఎలా ప్రదర్శిస్తునన్నారు , ఎవరిపై ప్రదర్శిస్తున్నాము అన్నది బాగా ఆలోచించాలి. ముందు వెనుకా ఆలోచించకుండా కోపాన్ని ప్రదర్శిస్తే ఎక్కువగా నష్టం మనకే జరుగుతుంది. ఆ తరువాత కోపం తగ్గాక ఇలా చేసుంటే బాగుండేది, ఇలా జరుగుండాల్సింది కాదు అని ఎంత తలబాదుకున్నా జరిగినదాన్ని మార్చలేము. కోపం ఒక మోతాదు వరకు అయితే సరే అలా కాకుండా కట్టలు తెంచుకుని కోపం వచ్చి ఎదుటి వారిని బాధ పెట్టడం లేదా ఆ సమయంలో మనల్ని మనం బాధ పెట్టుకోవడం వలన అది మన జీవితం పై కూడా ప్రభావం చూపుతుంది.

మన జీవిత లక్ష్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఏదో పొరపాటు చేయడం వలన బాస్ దగ్గర మాట పడాల్సి వస్తే.. సాధారణంగా కోపం వస్తుంది అయితే వ్యక్త పరిచే విధానంగా సరిగ్గా లేకపోతే జాబ్ నే పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎలా  బాస్ కోపాన్ని తగ్గించాలి, మనం చేసిన పొరపాటును ఎలా సరిచేయాలి అని ఆలోచించాలి. కానీ అనవసరంగా అత్యంత కోపంతో ఊగిపోయి కెరియర్ ని పాడు చేసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: