తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు కాస్త ఎక్కువగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాస్త సీరియస్ గా రాష్ట్ర ప్రబ్భుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు తాజాగా. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో కేసీఆర్ సేద తీరుతున్నాడు అని అన్నారు.

కేసీఆర్ డిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగం అని ఆయన ఆరోపించారు. ఈ తీర్థ యాత్రలతో రైతాంగానికి తెలంగాణ కు అయ్యేది, పొయ్యేది ఏమి లేదు అని వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏంది.. ? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్, బీజేపీ రాజకీయా చదరంగంలో రైతు పావుగా మారాడు అని రైతాంగానికి అండగా నిన్న, నేడు, రేపు కాంగ్రెస్ ఉంటుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: