ఉక్రెయిన్ దేశం రష్యాలో భారత్ ఆయిల్ కొనకుండా ఆ దేశంతో సంప్రదింపులు జరపకుండా చూడాలని ఆ దేశానికి సంబంధించిన అధికారులు అమెరికాను కోరారు. దీంతో రష్యాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురై మనం చెప్పినట్లు రష్యా వినే పరిస్థితి వస్తుందని వీరి భావన. అయితే భారత్ తన ఆర్థిక మూలాలు ఎక్కడా దెబ్బతినకుండా రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు చేస్తుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే యూరప్ దేశాలు, అమెరికా పూర్తిగా ఉక్రెయిన్ కు సహకరిస్తున్నాయి.


భారత్ మాత్రం రెండు దేశాలకు మద్ధతు ఇవ్వడం లేదు. అలాగని వ్యతిరేకించడం లేదు. తటస్థంగా ఉండి తన దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా చూసుకుంటుంది. ఎవరైనా తన దేశంలో ఆర్థిక సంక్షోభం రాకుండా చూసుకుంటేనే వేరే దేశాలను సాయం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఉక్రెయిన్ కోసం బ్రిటన్ లాంటి దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేశాయి. దీంతో అక్కడ ఆర్థిక సంక్షోభం మొదలైంది.


అది ఒక దాని నుంచి మరో వాటిపై ప్రభావం చూపుతూ ప్రస్తుతం అక్కడ పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. కరెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంటుంది. అయినా మేం ఉక్రెయిన్ కు సాయం చేస్తూనే ఉంటాం అంటూ గొప్పలకు పోతున్నారు. ఇంతటి దిగజారుడు పరిస్థితికి కారణం ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమని మాత్రం భావించడం లేదు. దీనికి పరోక్షంగా కారణం అమెరికా అని ఆయా యూరప్ దేశాలు గ్రహించడం లేదు.


వివిధ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి వాటికి సాయమందించినట్లు నటించడం అమెరికా ఎత్తుగడ. ఇలాంటి ఎత్తుగడలో భారత్ పడటం లేదు. మన దేశ అవసరాలకు తగినట్లుగా మనం ఉంటున్నాం. దీన్ని ఓర్వలేని ఉక్రెయిన్ భారత్ ను రష్యా నుంచి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకుండా చూడాలని కోరుతోంది. అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: