ఇన్ని రోజులుగా జరుగుతున్న యుద్దంలో అమెరికా యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతిచ్చాయి. చైనా, భారత్ లు రష్యా లో ఆయిల్ కొని పరోక్షంగా పుతిన్ కు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా విధానాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కౌన్సిల్ ఆప్ యూరప్ దేశాలు 46 దేశాలు ఉన్నాయి.


ఐక్యరాజ్య సమితిలో 122 దేశాలు రష్యా కు వ్యతిరేకంగా ఓటేశాయి. 18 ఓటు వేయలేదు. అందులో ఇండియా ఉంది. అయిదు దేశాలు మాత్రమే రష్యా కు అనుకూలంగా ఓటేశాయి.  ప్రస్తుతం ఉక్రెయిన్ కు సంబంధించిన వ్యవహారంలో జార్జియా వ్యవహారం, రష్యా న్ ఫెడరేషన్ కు సంబంధించి జరిగిన ఓటింగ్ లో భారత్, చైనా రెండు రష్యా కు వ్యతిరేకంగా ఓటేశాయి.


దీంట్లో ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్ లో 46 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. ఇందులో భారత్, చైనా కూడా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది.  అయితే ఈ వ్యతిరేక ఓటు వేసినంతా మాత్రాన రష్యాకు శత్రువు అయిపోనట్లు కాదు. ఇందులో నాలుగైదు రకాల అంశాలను జోడించారు. ఒకటి జార్జియా, ఉక్రెయిన్ దేశాలపై జరుగుతున్న దాడి అయితే.. మిగతా కారణాలు వివిధ దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోకపోవడం, ఫండమిక్ సస్టయినబుల్ డెవలఫ్మెంట్ విషయంలో కూడా విఫలం, ఈయూ కు సంబంధించిన విషయంలో విఫలం.


ప్రపంచంలో ఎవరూ సంక్షోభం సృష్టించాలని అనుకున్న సరే.. కచ్చితంగా దాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధమనే ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఓటింగ్ అనుకూలంగా ఓటేసింది. కానీ రష్యాకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పలేం.. అయితే రష్యాకు అనుకూలంగా అయిదు దేశాలు మద్దతు తెలిపాయి. ఉబ్జెకిస్తాన్, తజకిస్తాన్,ఇరాన్, ఇరాక్, సౌతాఫ్రికా లాంటి దేశాలు రష్యాకు అనుకూలంగా ఓటేశాయి. అయితే ఈ ఓటింగ్ విషయంలో ఇండియా అబెసెంట్ కాకపోవడం కీలకమైన విషయంగా చెప్పొచ్చు. అయితే ఇదే విషయంపై ఇండియా, చైనా రెండు దేశాల్లో మార్పు వస్తున్నట్లు ఈయూ దేశాల వార్త పత్రికలు రాసుకొస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: