ఓ వైపు తమ శాఖల పరిధిలో రివ్యూలు నిర్వహిస్తూనే మరోవైపు వేటు వేయడం ప్రారంభించింది. ఈ నెల 7న సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఓ వైపు ప్రమాణ స్వీకారం చేస్తూనే మరోవైపు ప్రగతి భవన్ ముళ్ల కంచెలు బద్దలయ్యాయి. అయితే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2014 డిసెంబరు నుంచి 2023 వరకు గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖ పరిధిలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఖర్చులు, ప్రజలకు ఏ మేరకు ప్రయోజనాలు అందాయనే వివరాలతో కూడిన శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. ఇది ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ కు షాక్ అనే చెప్పవచ్చు.
ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిత నివేదికను శ్వేత పత్రం అంటారు. అంటే ఒక అంశానికి సంబంధించి పూర్తి వివరాలు, ప్రభుత్వ అధికారిక సమాచారంతో రూపొందించిన వాస్తవ నివేదికే శ్వేతపత్రం. మిగులు బడ్జెజ్ గా ఏర్పాటైన తెలంగాణ ఎందుకు అప్పుల కుప్పగా మారింది. దీంతో పాటు నీటి పారుదల, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపేందుకు శ్వేత పత్రం అనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. అయితే దీనివల్ల ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారు. అప్పులను సాకుగా చూపి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేస్తారా.. లేదా గత ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి