
కార్యకర్తలు జగన్ ను డైరెక్ట్ గా కలవాలని ప్రయత్నించినా వాస్తవంగా సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. గత ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి కారణమైన వ్యక్తులనే జగన్ ఇప్పటికీ నమ్ముతుండటం పార్టీని అభిమానించే వ్యక్తులను ఎంతగానో బాధ పెడుతోంది. సొంత కుటుంబ సభ్యులు సైతం జగన్ ను దూరం పెట్టడం రాజకీయంగా జగన్ కు తీరని నష్టం చేస్తోంది. కూటమి సర్కార్ జగన్ ను మించి సంక్షేమ పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోంది.
జగన్ మారాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోసారి పాదయాత్ర చేసి కార్యకర్తలతో మమేకమై ప్రజల మనసులో తనపై ఉన్న అభిప్రాయాన్ని జగన్ తెలుసుకుంటే వైసీపీకి జరుగుతున్న నష్టం కొంతమేర అయినా తగ్గుతుంది. ఎంతో కష్టపడితే తప్ప రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు.
వైసీపీలో ప్రజాస్వామ్య లక్షణాలు పెరగాల్సిన అవసరం ఉందని గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సైతం చిన్నాపెద్దా అనే తేడాల్లేకుండా అందరినీ కలుపుకొని పోతే పార్టీలో ఉండే నేతలు, కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం మరింత కష్టపడతారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేయని పక్షంలో దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. రాబోయే రోజులలో జగన్ లో కొంతమేర అయినా మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది.