పసిడి ప్రియులకు భారీ షాక్.. పసిడి ధరలు పైకి కదిలాయి...బంగారానికి ఉన్న క్రేజ్ ఎక్కువ కావడంతో ధరలు పెరిగాయి. ఎంతో విలువైన, చాలా ఖరీదైన వస్తువు. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.


హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పైకి ఎగసి రూ. 46,530 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 42, 650 కు చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు అదే మార్గంలో భారీగా పెరిగాయి.. కిలో వెండి ధర రూ.1200 పెరిగి రూ. 70, 500 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమల నుంచి నాణేల తయారీ, వివిధ రకాల వెండి వస్తువుల తయారీ పెరగడంతో వెండి కి డిమాండ్ కూడా ఎక్కువైంది. దీని కారణంగానే వెండి ధరలు భారీగా పెరిగాయి.


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా నేడు బంగారం , వెండి ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు. బంగారం ధర ఔన్స్‌కు 0.22 శాతం తగ్గుదలతో 1737 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.23 శాతం క్షీణతతో 25.19 డాలర్లకు తగ్గింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు తదితర అంశాలు ఈ ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: