గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 19వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ప్ర‌ముఖుల జననాలు..

1900: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్
1917: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
1952: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
1954: ఇందూ షాలిని, భారత విద్యావేత్త
1966: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999).ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదులో కారులో వెళ్తూ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి (అమృతలూరు మండలం) గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు.

సెప్టెంబరు 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
1984: తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి

ప్ర‌ముఖుల మరణాలు

1978: మాడభూషి అనంతశయనం అయ్యంగారు, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు
1982: ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
1998: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ట్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909)
2008: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958)
2013: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934)

మరింత సమాచారం తెలుసుకోండి: