
ఇక అలాగే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన విడుదల చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మలయాళం సినిమా 2018 సినిమా అక్కడ విడుదలై మంచి విజయాన్ని అందుకోగా ఆ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది.. ఇక్కడ కూడా కలెక్షన్ల పరంగా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. చిత్రంలో ఉన్న గొప్ప కథని ఇక్కడ ప్రేక్షకులు కూడా చాలా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ సినిమాని తెలుగులో బన్నీ వాసు విడుదల చేసినట్లు సమాచారం.
2018 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.. ఈ సినిమా మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి దాదాపుగా మూడు రోజులలోనే రూ.4.48 కోట్ల రూపాయల కలెక్షన్లను అందించింది. ఫస్ట్ డే నుంచి మూడు రోజులకు కలెక్షన్లు పెరుగుతూ రావడానికి ఈ సినిమా కొన్న బన్నీ వాసు అతి తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా తో బన్నీ వాసు జాక్ పాట్ కొట్టారని చెప్ప వచ్చు. అలాగే చిన్న సినిమాగా విడుదలైన మేము ఫేమస్ సినిమా కూడా ఇప్పటికే లాభాల బాటలో వెలుబడుతున్నట్లు తెలుస్తోంది.