ఈ వారం టాలీవుడ్ లో చాలా గాసిప్స్ వినిపించాయి. రాబోయే సినిమాల టైటిల్స్ విషయంలో హీరో హీరోయిన్ల కాంబినేషన్ల విషయంలో లెక్కకు మించి గాసిప్స్ వచ్చాయి. అయితే వీటిల్లో అందరి దృష్టిని ఆకర్షించిన గాసిప్ మాత్రం ఒక్కటే. అదే పింక్ రీమేక్ లో రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్ లలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన అమ్మాయిల పాత్రల్లో అంజలి, నివేదా థామస్ నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు వకీల్ సాబ్ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసినా తరువాత న్యూమరాలజీ ప్రకారం లాయర్ సాబ్ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఏ టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారన్న విషయంలో అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ గాసిప్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. గత రెండు రోజులుగా ఈ వార్త మీడియా సర్కిల్స్‌లో తెగ షికారు చేస్తోంది. దీంతో ఈ వార్త రేణు దేశాయ్ వరకు వెళ్లటంతో ఆమె స్పందించారు. తాను పింక్ రీమేక్‌లో నటించటం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రేణు దేశాయ్ హైదరాబాద్‌లో కొనుక్కున్న ఫ్లాట్‌ను కూడా పవన్ కొనిచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కూడా రేణు గట్టిగా స్పందించారు. ఆ ఫ్లాట్ తన కష్టార్జితం అంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.