
అయితే ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్' సినిమాని చూశారు. మే 17న ఇండియాలో రిలీజ్ అయిన ఈ సినిమాలో టామ్ క్రూజ్ హీరోగా నటించారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా రివ్యూని ప్రేక్షకులతో పంచుకున్నారు. 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్ మూవిని చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే ఏడు పార్ట్స్ వచ్చాయి. ఆ ఏడు పార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. భారీగా కలెక్షన్స్ ని రాబట్టాయి. అందులో ఈ ఎనిమిదోవ చిత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దీన్ని మించిన కథ మళ్ళీ రాదేమో అనిపిస్తుంది. టామ్ క్రూజ్ నటన మాత్రమే కాదు, సినిమా మొత్తం మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాను చూశాక మనం ఫిలిం మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది' అని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సత్య యాధు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ బ్యానర్ పై తెరకెక్కింది.