- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ - దివ్యభారతి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా బొబ్బిలి రాజా. 1990లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను వెంకటేష్ సొంత నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా సురేష్ సంస్థ రజతోత్సవం సందర్భంగా రూపొందింది. ఈ సినిమా పూర్తి నిర్మాణ బాధ్యతలు సురేష్ బాబుకు అప్పగించారు రామానాయుడు. సురేష్ బాబు ఎంపిక మేరకే బాలీవుడ్ నుంచి దివ్యభారతిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా .. గ‌డుసరి పాత్రలో వాణిశ్రీ నటించిన కథ సిద్ధం చేసిన పరుచూరి సోదరులు మొదట వాణిశ్రీ పాత్రను ధనవంతురాలుగా రాసుకున్నారు.


అయితే ఆ పాత్రను మినిస్టర్ చేస్తే బాగుంటుందని పరిచూరు వెంకటేశ్వరరావుకు తర్వాత ఆలోచన వచ్చింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ కావడంతో వాణిశ్రీ పాత్రను అటవీ శాఖ మంత్రిగా మార్చారు. ఇక సురేష్ సంస్థతో వాణిశ్రీ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సంస్థ నిర్మించిన అనేక సినిమాల విజయంలో వాణిశ్రీది కీరోల్‌. తన వివాహానికి ముందు ఈ సంస్థలో ఆమె నటించిన చివరి సినిమా ఎంకి నాయుడు బావ. మళ్ళీ బొబ్బిలి రాజా సినిమాతో ఈ సంస్థలో వాణిశ్రీ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అయినా రాసిస్తాను కానీ ఈ పెళ్లికి అంగీకరించను అనే డైలాగ్ తో వాణిశ్రీ అఖిలాంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె భర్తగా సత్యనారాయణ.. సోదరులుగా కోట శ్రీనివాసరావు - విద్యాసాగర్ నిటించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: