ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దుగుమ్మలు సినిమా పరిశ్రమ లోకి వస్తూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది చాలా ఈజీగా అవకాశాలను దక్కించుకొని మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకునే దారిలో అనేక కష్టాలను ఎదుర్కొంటుంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగే క్రమంలో అనేక కష్టాలను ఎదుర్కొంది.

మరి ఈమె కెరియర్ ప్రారంభంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది అనే వివరాలను తెలుసుకుందాం. రకుల్ ప్రీత్ సింగ్ , సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కానీ ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా తెలుగులో ఓ స్టార్ హీరోతో రావాల్సిందే. కానీ అది కొంత భాగం రకుల్ పై పూర్తి చేసిన తర్వాత ఆమెను ఆ సినిమా నుండి తీసేసారు.

అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ లో మొదట కాజల్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారట. అందులో భాగంగా కొన్ని రోజుల చిత్రీకరణను కూడా రకుల్ పై చేశారట. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమెను ఆ సినిమా నుండి తీసేసి ఆమె పాత్రలో కాజల్ ను పెట్టుకున్నారట. అలా మొదటి తెలుగు సినిమా అవకాశం ఈమెకు చేజారిపోయింది. ఆ తర్వాత ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొంత కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: