
అయితే ప్రభాస్‌తో అలా సినిమా సెట్ అయిందో లేదో.. ఇంతలోనే త్రిప్తి డిమ్రీ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ హాట్ సెన్సేషన్ గ్యారేజీలో ఇప్పటికే రేంజ్ రోవర్ స్పోర్ట్, రెనాల్ట్ డస్టర్ వంటి కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీలిరంగు పోర్స్చే 911 కారెరా కారును త్రిప్తి కొనుగోలు చేసింది. వివిధ ఆటోమొబైల్ పోర్టల్స్ ప్రకారం.. ఈ కారు ధర రూ. 2.11 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు.
కాగా, న్యూఢిల్లీకి చెందిన త్రిప్తి.. 2017లో `పోస్టర్ బాయ్స్` అనే కామెడీ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. 2018లో రొమాంటిక్ డ్రామా `లైలా మజ్ను` మూవీతో హీరోయిన్‌గా మారింది. అయితే త్రిప్తికి బ్రేక్ ఇచ్చిన చిత్రం `యానిమల్`. ఈ మూవీ అందించిన క్రేజ్‌తో బాలీవుడ్ లో త్రిప్తి బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం `ధడక్ 2`, `అర్జున్ ఉస్తారా` వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. రీసెంట్ లో `స్పిరిట్` మూవీలోనూ కథానాయికగా ఎంపిక అయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు