ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి సినిమాకి అయినా కూడా హైప్ వ‌చ్చేది ఆ సినిమా కు సంబంధించిన ట్రైలర్ కట్ అనే చెప్పాలి అప్పుడు వరకు వచ్చిన కంటెంట్ వేరు ఈ సినిమా ట్రైలర్ వేరు అని అంటూ ఉంటారు .. ఇప్పుడు టీజర్లు ,  గ్లింప్స్ లు అంటూ చాలానే వస్తున్నాయి .. కానీ ఎప్పుడు నుంచో ఏ సినిమాకైనా కూడా ట్రైలరే ఎంతో కీలకం .. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ వాంటెడ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ పై ఎంతో ఆసక్తి నెలకొంది .. ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవడంతో ఉన్న హైప్ తగ్గిపోతూ వస్తుంది .. దీన్ని మళ్లీ పైకి తీసుకురావాలి అంటే అది కచ్చితంగా ట్రైలర్ వల్లే అవుతుందని నార్త్ డిస్ట్రిబ్యూటర్ సైతం గట్టిగా నమ్ముతున్నారు .


అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇదే ట్రైలర్ ఎంతో కీలక పాత్ర పోషించనుంది అని అంటున్నారు ... బిజినెస్ పరంగా ఇంకా  ఆఫ్ లైన్ లో కూడా హరిహర వీరమల్లు  పాట్ల అంత క్లారిటీ లేదు .. దీంతో ఆఫ్లైన్లో రచ్చ మొదలు కావాలి అంటే ట్రైలర్ లాంచ్ ని నేరుగా థియేటర్స్ లోనే ప్లాన్ చేయాలని అభిమానులు గట్టిగా కోరుతున్నారు .. అలాగే దీన్ని పక్కగా ప్లాన్ చేసుకుంటే రీచ్ కూడా బాగుంటుంద ని ఆ మధ్య కాలం లో కూడా చాలా సినిమాలు కి ఇది బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు .. అయితే థియేటర్స్ లో భారీ ఎత్తున హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేస్తే అది మేకర్స్ కే ప్లస్ కావచ్చు అని కూడా అంటున్నారు . ఇక మరి ఈ కీలక అంశం పై చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: